ఈనెల 29న విశాఖ లో ఏపీయూడబ్ల్యూజి మహాసభలు విశాఖ జిల్లా అధ్యక్షులు రామచంద్ర రావు

ఈనెల 29న విశాఖ వేదికగా విశాఖ జిల్లా ఏపీయూడబ్ల్యూజే మహాసభలు జరగనున్నట్టు జిల్లా అధ్యక్షులు రావులవలస రామచంద్ర రావు తెలిపారు. ఈ మేరకు వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలు కీలక భూమిక పోషించిన ఏపీయూడబ్ల్యుజి కొత్త ప్రభుత్వ పాలనలో జర్నలిస్టుల సమస్యలను చర్చించి ప్రజాప్రతిని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం ఈ మహాసభలకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ వి సుబ్బారావు చందు జనార్ధన్.. తదితరులు పాల్గొన్నారు 
ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్ పూర్వ అధ్యక్షులు కే రాము కోశాధికారి కిల్లి ప్రకాష్ తో పాటు పలువురు జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు