క్రియాశీలక సభ్యత్వంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయం జనసేన భీమిలి నియోజవర్గ ఇన్‌ఛార్జి సందీప్‌ పంచకర్ల

 మధురవాడ : జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీమిలి నియోజవర్గ ఇన్‌ఛార్జి సందీప్‌ పంచకర్ల అన్నారు. బుధవారం మారికవలసలో గల రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఏర్పాటు చేసిననే జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టాల్‌ వద్ద సందీప్‌ పాల్గొని సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భీమిలి నియోజకవర్గం మొత్తంగా అత్యధికంగా 1230 సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత దేవర శివదని కొనియాడారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పజెప్పినా వార్డు అధ్యక్షుడిగా వార్డులో ఉన్న నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచుకుని తనదైన శైలిలో విజయవంతంగా పూర్తిచేస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దానివలన కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వెయ్యికి పైగా నమోదు చేయడం భీమిలి నియోజకవర్గం మొత్తానికే దేవర శివ ఆదర్శమన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పినా ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఆకాంక్షించారు. వార్డు అధ్యక్షులు దేవర శివ మాట్లాడుతూ ఇన్‌ఛార్జి సందీప్‌ నాయకత్వంలో మేమంతా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నామని, ఆయన ఇచ్చిన భరోసాతో గతంలో కంటే ఇప్పుడు 1230 సభ్యత్వాలు చేసామని, రానున్న రోజుల్లో కూడా సందీప్‌ ప్రోత్సాహంతో మరిన్ని సభ్యత్వాలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సభ్వత్వాల నమోదు ప్రక్రియకు కృషి చేసిన 5వ వార్డు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదినారాయణ, సూరిబాబు, ఈశ్వరరావు, శివ, సంతోష్‌, సన్యాశిరావు, ఎర్రయ్య, రాజు, త్రినాధ్‌, నారాయణ, గణేష్‌, జగదీష్‌, వెంకటేష్‌, నరేష్‌, గోపి, శర్మ, చైతన్య, లక్ష్మణ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.