7వ వార్డులో బిజెపి నాయకుల కార్యవర్గ సమావేశం
July 05, 2024
గ్రేటర్ విశాఖ ఏడో వార్డు పరిధి మీదిలాపురి హుడా కాలనీలో గల బిజెపి ఆఫీసు నందు భీమిలి నియోజకవర్గం కో కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నాయకులతో వార్డ్ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం బిజెపి పార్టీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ సరిపల్లి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు వార్డు స్థాయి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించేందుకు ముందు ఉండవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతోనే పార్టీకి, వార్డు స్థాయి నాయకులకు గుర్తింపు పెరుగుతుందని అన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు మీతో అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మరు వాడ ఉద భాస్కర్, ఎండ్. అప్పారావు, ఎస్.తిరుపతి రావు, పి. శంకర్రావు, ఆర్.లక్ష్మీనారాయణ, దుర్గాసిరాము, పసుపులేటి శివకుమార్,రమ్య తదితరులు పాల్గొన్నారు.