మధురవాడ: చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఆషాడ మాసం శుక్ల పక్షం దశమి మంగళవారం సందర్భంగా నిత్య అర్చనలతో ప్రారంభించి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ చేసి అనంతరం నాగవళ్ళీ ధళార్చన, సుంధూరార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ, హరి స్వామి తదితరులు జరిపించి, నీరాజన మంత్రపుష్పం స్వామి వారికి సమర్పించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మధురవాడ యం.వి.వి సిటీ నివాసి శ్రీ కమలాకర్, శ్రీమతి ప్రమీల దేవి కుటుంబ సభ్యులు సహాకారంతో ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు ఎస్.ఎన్.మూర్తి సెక్రటరీ నాగోతి తాతారావు, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, గూడెల రాజు, దుక్క అప్పారావు, సుందర శ్రీను, పోతిన రాంబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.