ప్రజలకు సేవలు అందించడానికే తాను రాజకీయాలలోకి వచ్చానని, దానిలోనే సంతృప్తి ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలను ముగించుకొని శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్న ఆయన్ను అల్లిపురం శ్రీ గౌరీ సేవా సంఘం కమిటీ సభ్యులు, అల్లిపురం శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంధాలయం తరుఫున ఎమ్మెల్యేను కలిశారు. నగరంలో దేవాదాయశాఖకు సంబంధించి భూ సమస్యల తీవ్రంగా ఉన్నాయంటూ, అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించడం, వాటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వంశీకృష్ణ శ్రీనివాస్ కోరిన నేపథ్యంలో సంఘం కమిటీ సభ్యులు ఆయన్ను కలిసి అభినందించి, పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ అల్లిపురం వెంకటేశ్వరమెట్ట తదితర ప్రాంతాలలో దేవాదాయ శాఖకు సంబంధించి అధికంగా భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో సంఘం కార్యదర్శి పోలమరశెట్టి శ్రీను (ఎన్టీఆర్ శ్రీను), కోశాధికారి సూరిశెట్టి వేలు, ఉపాధ్యక్షుడు బుద్దా గోపి, సలహాదారులు సూరిశెట్టి శంకర్, బుద్ధ సన్యాసిరావు, దొడ్డి రాంబాబు తదితరులు ఉన్నారు.