మధురవాడ: మధురవాడ ఐటీ సెజ్ జంక్షన్ వద్ద గల మానం ఆంజనేయులు కాలనీలో వెలసిన శ్రీ లలితా త్రిపుర సుందరీ సమేత మహా కామేశ్వరస్వామి ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిసాయి.మూడు రాజులు పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినబాగంగావేడుకల్లో హోమాలుఆధ్యాత్మిక, ఆరాధన కార్యక్రమాలు,నిర్వహించారు. ఉదయం నుంచే మహా కామేశ్వర స్వామికి పంచామృత
సుగంధ, నారికేళ, పండ్ల రసాలుతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాలపూలు పత్రాలుతో పూజలు చేసి సుందరంగా అలంకరించారు. శ్రీ చక్రం సమేత లతితా త్రిపుర సుందరీ దేవికి, పంచముఖ ఆంజనేయ స్వామి,బధ్రాద్రి సీతారాముల స్వాములకు వేర్వేరుగా విశేష పూజలునిర్వహించారు. ఆలయ ఆవరణలోకళ్యాణార్ధం హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ధర్మకర్త బొడ్డేపల్లి
సురేష్, కమిటి సభ్యులు ప్రతాపరాజు, సీహెచ్పై నాయుడు, జేడీ నాయుడు తదితరులు అన్న ప్రసాదం వడ్డిన చేసి భారీ అన్న సంతర్పణను ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను మేళ తాళాలు, కోలాటంతో ఊరేగించారు. కార్యక్రమంలో కేవీ. రావుసోమేశ్వరరావు, సింహాచలం, విజయ్ కుమార్, అప్పారావు తదితరులు పాల్గోన్నార