బెట్టింగ్ యాప్ లో 20 లక్షలు నష్టపోయినసాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు ప్రయత్నం


బెట్టింగ్ యాప్ లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 20 లక్షలు నష్టపోయారు ఆ నష్టం నుంచి భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి వీడియో కాల్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో అదృష్టవశాత్తు పోలీసులు బాధితుడిని కాపాడారు 
మధురవాడ ఐటీ సెజ్ లోని మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో కే సుందర్ పనిచేస్తున్నారు ఇటీవల బెట్టింగ్ యాప్ ద్వారా 20 లక్షలు వరకు నష్టపోయారు దీంతో సూసైడ్ చేసుకుంటున్నట్టు తండ్రి సత్యనారాయణకు వీడియో కాల్ చేశారు. వెంటనే తండ్రి 1 1 2 కు ఫోన్ చేయగా పోలీసులు మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్ వద్ద సుందర్ ను గుర్తించారు వెంటనే అతన్ని కాపాడి కౌన్సిలింగ్ చేశారు బాధితుడు సుందర్ కు భార్య ఒక కుమార్తె ఉన్నారు బెట్టింగ్ యాప్ ల బారిన పడవద్దని పీఎం పాలెం సి ఐ బాలకృష్ణ  ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు