ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి డాక్టర్ కందుల నాగరాజు



ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేస్తున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు దక్షిణ నియో జకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డులోని పలు అభివృద్ధి పనులు చేపట్టి నట్లు వెల్లడించారు 34వ వార్డు కొబ్బరి తోటలో నవ వధువు యమునకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర పసుపు కుంకుమలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 32వ వార్డుతో పాటు నియోజకవర్గం లోని సుమారుగా అన్ని వార్డుల ప్రజల విన్నపం మేరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నట్లు వెల్ల డించారు అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల తన పార్టీ కార్యా లయంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ప్రజా దర్బార్ కార్య క్రమానికి పలు వార్డుల నుంచి ఎంతోమంది వస్తున్నారని చెప్పారు వారి సమస్యలను విని మరిన్ని వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకుని సాధ్యమైనంత మేర వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు తను నేరు గా కలిసిన వారిని మాత్రమే కాకుండా తనను ఫోన్లో సంప్ర దించిన వారికి కూడా వారి సమస్యలను సావధానంగా విని వారికి సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని ఈ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభి వృద్ధి దిశగా పయనిస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని వెల్ల డించారు ఈ కార్యక్రమంలో
తిరుపతిరావు,గణేష్,వెంకట రావు,గురుమూర్తి,నీలంరాజు, నరేష్,కందుల కృష్ణ,రమేష్ పాడి, సీపీఐ బుజ్జి,అప్పారావు,జానకి భారతి,కుమారి తదితరులు పాల్గొన్నారు.