పోయా మోసం.. బ్యాక్ డోర్ లో బుక్ అయ్యారు

మోసం అన్నారు.. మోస పోయాం అన్నారు.. లక్షలు పోగొట్టుకున్నాం న్యాయం చేయండి అంటూ బయటికి వచ్చిన విశాఖలోని అక్కయ్య పాలెం వద్ద ఉన్న LTW సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి తగిన న్యాయం దక్కింది.. తమకి రావాల్సిన జీతాలు చెక్కుల రూపంలో యాజమాన్యం అందజేసింది అని స్వయంగా వారే చెప్పారు.. అసలు ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితులు వచ్చాయి అంటే వారికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.. బ్యాక్ డోర్ అంటూ లక్షల రూపాయలు ఖర్చు చెయ్యడం మోసపోయాం అంటూ లబోదిబో అనడం ప్రతి ఒక్కరికి పరిపాటి గా మారింది.. ఉద్యోగం కోసం లంచం ఇవ్వడం కూడా నేరం అని ఈ బాధితులు కి ఎప్పుడు అర్థం అవుతుంది అర్థం కావడం లేదు..

*అసలు ఎవరు ఈ శృతి*

LTW సాఫ్ట్ వేర్ కంపెనీలో శృతి అనే మహిళ రోల్ ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి.. అంతా నేనే చేస్తాను అని హామీలు ఇచ్చే పరిస్థితి నుంచి, అంతా వాళ్లే చేశారు వాళ్లే చేయించారు నేను పోరాటం చేస్తాను అనే స్థాయికి ఎలా మారింది.. అసలు శృతిమించిన ఈ శృతి ఎవరు..? ఈ శృతికి రాగం ఇచ్చేది ఎవరు..? తాళం వేసేది ఎవరు..? ఎప్పటికీ ఈ ప్రశ్న తీరుతుందో తెలియదు కానీ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రం తీరిపోయాయి. కంపెనీ నష్టాలలో నడుస్తున్న సమయంలో జీతాలు ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు కానీ అలాంటి సమయాల్లో కంపెనీ టర్మినేషన్ అనే ఆయుధాన్ని వాడాల్సి ఉంటుంది. మరి ఈ కంపెనీ ఎందుకు టర్మినేషన్ అనే ఆయుధాన్ని వాడలేదు..? మోసం చేయాలని వాడలేదా..! మోసం చేయలేక వాడలేదా అనేది సగటు సామాన్యంగా ప్రశ్నగా మారింది..?