పల్నాడు జిల్లాలో సాక్షి విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఎపియుడబ్లూజే ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఓ ఏ మల్లిక్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్థంభంగా ఉన్న పత్రిక వ్యవస్థపై, విలేకరులపైన అమానుషంగా దాడులు జరపడం, కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు.ఏపీయుడబ్ల్యుజే నాయకులు జి ఎల్ నరసింహారావు మాట్లాడుతూ అన్యాయంగా,అక్రమంగా సాక్షి విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె బాజివలి, జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎస్ కె అన్ను, ఎపియుడబ్లూఎఫ్ నాయకులు వెన్నా శ్రీనివాస రెడ్డి, ఎమ్పిజె శాఖ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కె బాబు, ఎపియుడబ్లూజే నాయకులు ఎస్ కె మహబూబ్ భాష సయ్యద్ షాకీర్ హుస్సేన్, వేసపోగు రాజు, ఆదినారాయణ, మల్లికార్జున, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.అనంతరం పై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూనియన్ నాయకులు అందజేశారు.